బిగ్ బాస్ 3 కలిసి రాని వైల్డ్ కార్డ్

బిగ్ బాస్ సీజన్ 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కలిసి రాలేదని చెప్పాలి. మొదటి రెండు సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన వారితో పోల్చితే సీజన్ 3లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి వారం కాగానే హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. అయితే ఆమె హౌజ్ లో వివాదాలు సృష్టించడంతో రెండు వారాల్లోనే హౌజ్ నుండి బయటకు పంపించారు.   

ఇక ఆ తర్వాత శిల్పా చక్రవర్తిని హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ గా పంపించారు బిగ్ బాస్. అయితే ఆమె కూడా గట్టిగా రెండు వారాలు ఉండలేకపోయింది. మొదటివారం ఆమెను నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు కాబట్టి రెండో వారంలో ఆమెని నామినేట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ నాగార్జున ఎపిసోడ్ లో ఇంటి సభ్యులంతా తనని ఒంటరి దాన్ని చేశారంటూ నాగార్జునకు కంప్లైంట్ చేయడం హౌజ్ మెట్స్ కు నచ్చలేదు. 

ఆ కారణంతోనే ఆమెను హౌజ్ మెట్స్ అంతా లాస్ట్ వీక్ నామినేట్ చేశారు. అయితే షోలో ఆమె ఆడే తీరు.. స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా తీసుకోకపోవడం కూడా ఎలిమినేషన్ కు కారణమని తెలుస్తున్నాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో 10మంది మాత్రమే ఉన్నారు.