ఆ కిక్కేంటో అర్ధమైంది..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట ఈ సినిమా నిర్మించారు. సినిమాలో అధర్వ, పూజా హెగ్దె, మృణాలిని వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో మెగా ఫ్యాన్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు చీఫ్ గెస్ట్ గా వెంకటేష్ అటెండ్ అయ్యారు.  

ఇక ఈవెంట్ లో భాగంగా వరుణ్ తేజ్ ఇన్నాళ్లు తను ప్రయోగాలు చేశాను.. చిరంజీవి గారు మాస్ సినిమాలు చేయాలని చెప్పినా వాల్మీకి సినిమా ఫుల్ మాస్ రోల్ లో చేశాను.. ఈ పాత్ర చేయడం ఆ కిక్కే వేరబ్బా అన్నారు వరుణ్ తేజ్. ఇకనుండి మాస్ సినిమాలు చేస్తానని.. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ తో పాటుగా నటీనటులు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారని.. గద్దలకొండ గణేష్ మీ అందరికి నచ్చుతాడని అన్నారు వరుణ్ తేజ్. పిలవగానే సినిమా వేడుకకు వచ్చిన వెంకటేష్ గారికి తన కృత్జతలు తెలియచేశాడు వరుణ్ తేజ్. ఎఫ్-2 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందన్న విషయం తెలిసిందే.