
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో.. నా పేరు సూర్య తర్వాత బన్ని కొద్దిపాటి గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమా లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్. అయితే సుక్కు సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాకముందే వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ మూవీ ఎనౌన్స్ చేశాడు బన్ని. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
సుకుమార్ స్క్రిప్ట్ ఆలస్యం అవుతుందని వేణు శ్రీరాంకు ఓకే చెప్పాడట బన్ని. కాని సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ అవడంతో ఇప్పుడు ఐకాన్ సినిమా విషయంలో డైలమాలో పడ్డాడట అల్లు అర్జున్. వేణు శ్రీరాం చెప్పిన కథ నచ్చినా ఎందుకో ఆ ప్రాజెక్ట్ మీద బన్ని అంత ఫోకస్ గా లేడని తెలుస్తుంది. దాదాపుగా ఐకాన్ సినిమా ఆగిపోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.