రామ్ తోనే ఆరెక్స్ డైరక్టర్..!

పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన తర్వాత సినిమా విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. అసలైతే ఇస్మార్ట్ శంక తర్వాత అలాంటి మాస్ మూవీనే చేయాలని అనుకున్న రామ్ స్టార్ డైరక్టర్స్ కోసం చూశాడట. కాని ఇప్పుడు వాళ్లెవరు ఖాళీగా లేకపోవడంతో ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.    

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన సెకండ్ మూవీ కోసం దాదాపు వన్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. నితిన్ కు కథ చెప్పినా ఓకే అవలేదు. ఈమధ్య రవితేజతో సినిమా దాదాపుగా సెట్స్ మీదకు వెళ్లడమే అనుకోగా అనివార్యకారణాల వల్ల అది ఆగిపోయింది. ఇక ఫైనల్ గా రామ్ తో అజయ్ భూపతి సినిమా ఫైనల్ చేశాడట. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇస్మార్ట్ జోష్ లో ఉన్న రామ్ కు అజయ్ భూపతితో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.