
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ అంచనాలతో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న ప్లాన్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లేదా ఎల్.బి స్టేడియం ఈ రెండిటిలో ఒకటి కన్ఫాం అవుతుందట.
ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్. ఎస్ రాజమౌళి అటెండ్ అవనున్నారని తెలుస్తుంది. తెలంగాణా మంత్రి కె.టి.ఆర్ వస్తారని వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది. చిరు, పవన్ ఒకే వేదిక మీద ఉంటే మెగా ఫ్యాన్స్ చేసే హంగామా వేరు.. అలాంటిది ఆ వేదిక మీద రాజమౌళి కూడా ఉంటే ఇక అది చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు తీసిన తీస్తున్న రాజమౌళి సైరాకు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ అవుతున్నారు. మరి సైరా ప్రీ రిలీజ్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.