
ఏదైనా తెలుగు పరిశ్రమలో ప్రయోగాలు చేయాలంటే అది కింగ్ నాగార్జున తర్వాతే ఎవరైనా.. శివ సినిమా నుండి మన్మథుడు 2 వరకు క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తాడు. టాలెంట్ ఉన్న వారిని ఏరుకుని ఎంచుకుని సినిమాలు చేసే నాగార్జున ఈమధ్య కాస్త తడపడుతున్నాడని తెలిసిందే. మన్మథుడు 2 ఊహించని షాక్ ఇవ్వడంతో నాగార్జున ఇక కొత్త దర్శకుల జోలికి వెళ్లకూడదని అనుకున్నారు.
అయితే అందరు అనుకున్నట్టు చేస్తే అతను నాగార్జున ఎలా అవుతాడని అనుకునేలా ఓ నూతన దర్శకుడి సినిమాకు ఓకే చెప్పాడట నాగార్జున. మహర్షి సినిమాకు రచనా సహకారం అందించిన సోల్ మాన్ నాగార్జున కు ఓ అద్భుతమైన కథ వినిపించారట. నాగ్ కు ఆ కథ బాగా నచ్చిందట. సోల్ మాన్ తో నాగ్ మరో ప్రయోగం చేయబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సింది కాని అది ఇంకా వాయిదా పడుతూనే ఉంది.