నిధి అగర్వాల్ కు మెగా ఛాన్స్

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో అలరించిన నిధి అగర్వాల్ ఆ సినిమాల్లో అమ్మడి వరకు బాగానే అనిపించినా సినిమాల ఫలితాల వల్ల ఆమె కెరియర్ రిస్క్ లో పడ్డది. అయితే రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవడంతో నిధి అగర్వాల్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది. అక్కినేని హీరోలకు కలిసి రాని ఈ అమ్మడి కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది.   

లేటెస్ట్ గా నిధి అగర్వాల్ మెగా మూవీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. చిత్రలహరి తర్వాత సాయి ధరం తేజ్ మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా సైన్ చేశాడట. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీలో సాయి ధరం తేజ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిందట. మెగా హీరో సినిమానే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.