
సీత సినిమా ఫ్లాప్ తో షాక్ తిన్న డైరక్టర్ తేజ మరోసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ జోలికి వెళ్లడని అనుకున్నారు. సీత సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినా కూడా మొత్తం కాజల్ మీద ఫోకస్ పెట్టాడు. అయితే అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక తేజ తన తర్వాత సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా కథ పూర్తి చేశాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.
ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీనే అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్ ఆ ఒక్క సినిమాతోనే సూపర్ హాట్ ఇమేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ మరో ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క వెంకటేష్ వెంకీమామ, రవితేజ డిస్కో రాజా సినిమాల్లో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ తేజ డైరక్షన్ లో ప్రయోగాత్మక సినిమాకు ఓకే చెప్పిందట. తేజ చేసిన సీత సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మరి వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.