ప్రతిరోజు పండుగే ఫస్ట్ లుక్

మెగా హీరో సాయి ధరం తేజ్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తుండగా బన్ని వాసు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

ఫస్ట్ లుక్ లో గొడుగులతో సాయి ధరం తేజ్, సత్య రాజ్ ఇద్దరు కలిసి సరదాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో మారుతి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగే సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఫ్యామిలీ మూవీనే అయినా మెగా ఫ్యాన్స్ ను అలరించే కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సాయి ధరం తేజ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.