
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మొన్నటిదాకా గెలిచిన నరేష్ కు, ఓడిన శివాజి రాజాకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అది ముగిసింది అనుకునేసరికి 'మా'లో మళ్లీ కొత్త గొడవలు మొదలయ్యాయి. ఈసారి ప్రస్తుతం 'మా'లో గెలిచిన ప్యానెల్ లో ఉన్న సభ్యుల మధ్య ఫైటింగ్ జరుగుతుందట. ప్రస్తుత మా ప్రెసిడెంట్ నరేష్ మీద వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్ కోపంగా ఉన్నారని తెలుస్తుంది.
అధ్యక్షుడిగా నరేష్ ప్రవర్తన మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. మా నూతన కార్యవర్గం ఏర్పడి 6 నెలలు కావొస్తున్నా ఇంతవరకు అసోషియేషన్ లో ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. అధ్యక్షుడిగా ఉన్న నరేష్ సొంత పనుల్లో బిజీగా ఉండటం వల్ల చేయాల్సిన పనులన్ని ఆగిపోయాయట. ఓ పక్క ఫండ్ రైజింగ్ చేయకపోగా 'మా' ఎకౌంట్ నుండి 20 లక్షలు ఖర్చు చేశారట. అయితే అసోషియేషన్ కోసం కాకుండా నరేష్ 20 లక్షలు దేనికి ఖర్చు పెట్టారంటూ కార్యవర్గ సమావేశంలో ప్రస్థావించారట. ఇలాంటివి ప్యానెల్ కు చెడ్డపేరుని తెస్తాయని.. నరేష్ కు అధ్యక్ష పదవి చేసే ఉద్దేశం లేకపోతే అతన్ని దించి అతని ప్లేస్ లో వెరొకరిని పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.