
కింగ్ నాగార్జున హీరోగా చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మథుడు-2. నాగార్జున సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన మన్మథుడుకి సీక్వల్ గా ఈ సినిమా వస్తుంది. అయితే టైటిల్ మాత్రమే సీక్వల్ కాని కథ మాత్రం వేరే అని తెలుస్తుంది. ఈమధ్యనే టీజర్ తో అలరించిన మన్మథుడు 2 లేటెస్ట్ గా సినిమాలో అవంతికను ఇంట్రడ్యూస్ చేశాడు.
సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అవంతికగా రకుల్ అందరి ముందు పద్ధతిగా నటించి నాగార్జునకి మాత్రం తన ఒరిజినల్ క్యారక్టర్ చూపిస్తుంది. అవంతిక స్పెషల్ టీజర్ రకుల్ ఫ్యాన్స్ కు భలే కిక్ ఇస్తుంది. సినిమాలో రకుల్ కూడా ప్లస్ అయ్యేలా ఉంది. మన్మథుడు-2లో కీర్తి సురేష్, సమంతలు కూడా నటిస్తున్నారు. ఆగష్టు 9న రిలీజ్ అవనున్న మన్మథుడు-2 నాగార్జునకు మళ్లీ మొదటి సినిమా రేంజ్ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.