
రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమాలో ఇద్దరు రియల్ లైఫ్ సూపర్ స్టార్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ నటిస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ ఒక ఎత్తైతే త్వరలో జరిగే షెడ్యూల్ ఒక ఎత్తని అంటున్నారు.
చరణ్, తారక్ ఇద్దరు కలిసి పాల్గొనే యాక్షన్ పార్ట్ షూట్ చేస్తారట. ఈ యాక్షన్ ఘట్టాల కోసం ఏకంగా 30 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఆ మూవీని కూడా మించే అంచనాలతో వస్తుంది. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలని జక్కన్న అండ్ టీం కమిట్మెంట్ తో ఉన్నారట. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.