
క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ నెల 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వరంగల్ లో జరిగింది. బోనాలు పండుగ మొదలైన సందర్భంగా సినిమాలోని ఆ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకలితో ఉన్న తనకు రామ్ దొరికాడని.. తన ఆకలి తీర్చాడని చెప్పాడు పూరి.
టెంపర్ తర్వాత ఒక్క హిట్టు కూడా కొట్టని పూరి ఇస్మార్ట్ శంకర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. 18 రిలీజ్ ఫిక్స్ చేసినా ఇప్పటివరకు ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని టాక్. వరల్డ్ వైడ్ గా సినిమా మొత్తం తీసుకోమని దిల్ రాజు దగ్గరకు పూరి వెళ్లినా అంత ఇంట్రెస్ట్ చూపించలేదట. సినిమా మీద నమ్మకం ఉన్నా ప్రస్తుతం కమిటైన సినిమాల వల్ల ఇస్మార్ట్ శంకర్ కు హ్యాండ్ ఇచ్చాడట. అయితే పూరి రిక్వెస్ట్ చేయగా నైజాం, వైజాగ్ రైట్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు.