నందిని రెడ్డికి ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ ఎవరు..!

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మరిన నందిని రెడ్డి నిన్న శుక్రవారం రిలీజైన ఓ బేబీతో సూపర్ హిట్ అందుకుంది. కొరియన్ మూవీ అఫిషియల్ రీమేక్ గా వచ్చిన ఓ బేబీలో సమంత లీడ్ రోల్ చేసింది. సమంత నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జబర్దస్త్ సినిమాతో  కలిసి పనిచేసిన నందిని రెడ్డి, సమంత చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకు కలిసి పనిచేసారు. ఇక ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తుందని తెలుస్తుంది.

ఓ బేబీ కంటే ముందు నందిని రెడ్డి స్టార్ హీరోతో సినిమా చేయాల్సిందట. కాని ఓ బేబీ రావడం షూటింగ్ స్టార్ట్ అవడం రిలీజ్ అవడం కూడా జరిగింది. నందిని రెడ్డి డైరక్షన్ లో నటించే స్టా హీరో ఎవరన్నది ప్రస్తుతం కన్ ఫ్యూజన్ గా ఉంది. స్టార్ హీరోలంతా వారి వారి కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండగా న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండలలో ఒకరు నందిని సినిమా చేస్తారని తెలుస్తుంది.