ఎన్.టి.ఆర్ తో స్నేహం మాత్రమే

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, హీరోయిన్ సమీరా రెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో పడి పరిస్థితుల కారణంగా విడిపోయారన్న వార్తలు అప్పుడు సెన్సేషనల్ గా మారాయి. అయితే ఈ వార్తలపై మొదటిసారి స్పందించింది హీరోయిన్ సమీరా రెడ్డి. ఎన్.టి.ఆర్ తనకు మంచి స్నేహితుడు మాత్రం సినిమా గురించి నటన గురించి తను నాకు ఎన్నో విషయాలు చెప్పాడు. 

మా మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి రకరకాల వార్తలు రాశారు. కాని తామిద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. తారక్ తో సమీరా రెడ్డి అశోక్, నరసిం హుడు సినిమాల్లో నటించింది. అశోక్ సినిమా హిట్ అవగా నరసిం హుడు డిజాస్టర్ అయ్యింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి సమీరా రెడ్డి మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది.