
బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది.. కంగారు పడకండి ఇక్కడ కాదు తమిళంలో.. కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 అంగరంగ వైభవంగా మొదలైంది. కంటెస్టంట్స్ అంతా దాదాపు తమిళ ఆడియెన్స్ కు పరిచయం ఉన్నావారే కావడం విశేషం. అయితే షో మొదలైందో లేదో అప్పుడే ఒక కంటెస్టంట్ తన సత్తా చాటేస్తుంది. శ్రీలంక బ్యూటీ లోస్లియా బిగ్ బాస్ సీజన్ తమిళ్ లో హాట్ కంటెస్టంట్ గా మారింది.
తమిళ నటి అయిన లోస్లియా తన అందంతో చురుకుదనంతో బిగ్ బాస్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. లాస్ట్ సీజన్ లో ఓవియాలా ఈ సీజన్ మొదలైన కొద్దిరోజులకే లోస్లియా కోసం గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే ఆమె కోసం ఓ ఆర్మీని తయారు చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 మరోసారి సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇక తెలుగు బిగ్ బాస్ 3 ఈ నెల 21 నుండి మొదలవుతుందని తెలుస్తుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 ఈసారి కంటెస్టంట్స్ కూడా బాగా పాపులారిటీ ఉన్న వాళ్లనే తీసుకున్నట్టు టాక్.