
ఓంకార్ డైరక్షన్ లో రీసెంట్ గా మొదలైన సినిమా రాజు గారి గది-3. రాజు గారి గది సూపర్ హిట్ అవగా రాజు గారి గది 2 అంటూ నాగార్జున, సమంతలతో భారీ మూవీ తీశాడు ఓంకార్. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇప్పుడు రాఉ గారి గది 3 ప్లాన్ చేశారు. అశ్విన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మొదట తమన్నా హీరోయిన్ గా అనుకున్నారు. ముహుర్త కార్యక్రమాల్లో తమన్నా అటెండ్ అయ్యింది కూడా.. కాని మధ్యలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ నుండి తమన్నా బయటకు వచ్చేసిందట.
తమన్నా ప్లేస్ లో తాప్సీ కాని కాజల్ కాని ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో ఈమధ్య తాప్సీ కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా గేమ్ ఓవర్ సినిమాతో హిట్ అందుకుంది తాప్సీ. ఇక కాజల్ కూడా కెరియర్ లో మంచి ఫాంలో ఉంది. కాజల్ గ్లామర్ కూడా తోడవుతుంది కాబట్టి రాగు గారి గది 3కి కాజల్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాజల్ కూడా ప్రస్తుతం ప్రయోగాలకు సై అంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన సీత నిరాశపరచగా రాబోయే సినిమాల మీద నమ్మకం పెట్టుకుంది.