
హీరోగా మంచి ఫాంలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అ! అంటూ అందరు ఆశ్చర్యపడేలా చేసిన అతను ఈమధ్యనే కల్కి సినిమాతో వచ్చాడు. ప్రశాంత్ వర్మ టాలెంట్ మెచ్చిన నాని అతనికి మరో ఛాన్స్ ఇస్తున్నాడట. ఈసారి నిర్మాతగా కాకుండా అతని డైరక్షన్ లో నాని హీరోగా సినిమా వస్తుందని తెలుస్తుంది.
జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరో పక్క ఇంద్రగంటి మోహనకృష్ణ 'వి' సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత నాని ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకే అయ్యిందట. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.