
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఓ బేబీ. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా సమంత మాత్రమే చేస్తుంది. అంతేకాదు సమంత క్రేజ్ చూసి హైదరాబాద్ దేవి థియేటర్ ముందు సమంత భారీ కటౌట్ కూడా పెట్టారు.
సినిమా రిలీజ్ టైంలో ఇలా భారీ కటౌట్లు పెట్టేది కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాని ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సమంత కొనసాగిస్తున్న ఈ ఫాం ను చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లు కునేలా ఉన్నారు. కొరియన్ మూవీ రీమేక్ గా వస్తున్న ఓ బేబీ సినిమాలో నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి లక్ష్మి కూడా నటిస్తున్నారు.