
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న్ ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా సినిమా బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరుగుతుంది. ప్రస్తుతం సైరా కర్ణాటక రైట్స్ 32 కోట్లకు అమ్ముడయ్యాయట.
కర్ణాటకలోనే బిజినెస్ ఇలా ఉంది అంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించవచ్చు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ డీల్ సెట్ అయ్యిందట. రిలీజ్ ముందే బిజినెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా, అనుష్క వంటి హీరోయిన్స్ స్పెషల్ రోల్స్ చేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి క్రేజీ స్టార్స్ కూడా సైరాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మరో బాహుబలి అవడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతున్నారు.