అరుంధతి 2 పాయల్ అనుమతి లేకుండానే..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో కోడి రామకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అరుంధతి. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా సీక్వల్ గా అరుంధతి 2 వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగినా అది కుదరలేదు. ఇక ఈమధ్య శ్రీ శంఖుచక్ర ఫిలిమ్స్ వారు అరుంధతి 2 తీస్తున్నట్టు ప్రకటించారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుందని అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. 

దీనిపై పాయల్ రాజ్ పుత్ స్పందించింది. అరుంధతి 2 సినిమా కోసం తన దగ్గరకు దర్శక నిర్మాతలు వచ్చారని కాని ఆ సినిమాకు ఇంకా తన అభిప్రాయం తెలుపలేదని అన్నది. కాని ఇంతలోనే తను ఆ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించడంతో తాను హర్ట్ అయినట్టు చెప్పుకొచ్చింది. తన అనుమతి లేకుండానే ఆ సినిమాలో తను నటిస్తున్నట్టుగా ఎలా ప్రకటిస్తారని నిర్మాతపై ఫైర్ అవుతుంది పాయల్. మరి ఆమెను ఒప్పించి అరుంధతి 2 చేస్తారా లేక ఆ ప్రాజెక్ట్ వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.