
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న సైరా సినిమా నిర్మాణ బాధ్యతల నుండి చరణ్ తప్పుకున్నాడట.
సినిమా చివరి దశలో ఉండగా చరణ్ తప్పుకోవడం ఏంటని షాక్ అవ్వొచ్చు. ఓ పక్క తను నటించే సినిమా.. మరో పక్క సైరా నిర్మాణ బాధ్యతలు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడట రాం చరణ్. అందుకే సైరా సినిమా నుండి దూరమయ్యాడట. ఇకనుండి చిరంజీవి మొత్తం నిర్మాణ వ్యవహారం చూస్తారట. రాం చరణ్ ప్రస్తుతం తను చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ కానున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలంటే తారక్, చరణ్ ఇద్దరు షెడ్యూల్ ప్రకారంగా పనిచేయాల్సి ఉంది.