బిగ్ బాస్ 3 లేటెస్ట్ ప్రోమో.. హోస్ట్ ఎవరంటే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 త్వరలో మొదలు కాబోతుంది. స్టార్ మా దీనికి కావాల్సిన హంగామా మొదలుపెట్టేసింది. హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాగార్జున దాదాపు కన్ఫాం అయినా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు. ఈమధ్యనే బిగ్ బాస్ 3 అతి త్వరలో అంటూ ప్రోమో వదిలిన స్టార్ మా లేటెస్ట్ గా బిగ్ బాస్ 3 హోస్ట్ కు సంబందించి ఓ ప్రోమో వదిలారు.   

మనసు కోతి లాంటిది.. అలాంటి మనసున్న మనుషులు ఒకే ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వారిని ఏకతాటిపై తెచ్చేదెవరు అధికారంతో నడిపేది ఎవరు. ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని శక్తి గల వ్యక్తి ఎవరు అంటూ ఓ పెద్దాయన చెబుతుంటాడు. ఇంతలో ముసుగు వీరుడిగా బిగ్ బాస్ 3 హోస్ట్ కనిపిస్తాడు. నాగార్జునని ఇంకా రివీల్ చేయడం ఇష్టం లేదనుకుంటా అందుకే అధికారంతో నడిపించే శక్తి గల వ్యక్తి అంటూ ప్రోమో వదిలారు.

ఆ ముసుగు వీరుడు కచ్చితంగా నాగార్జున అని అందరికి తెలుసు. మొత్తానికి హోస్ట్ గా నాగార్జున ఫైనల్ అయ్యాడు. మరి కంటెస్టంట్స్ పరిస్థితి ఏంటో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు చెక్కర్లు కొడుతున్నాయి.