
పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం కల్కి సినిమాతో వస్తున్నాడు. అ! సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెకెక్కింది. సి.కళ్యాణ్, జీవిత రాజశేఖర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఫిలిమ్స్ రాధా మోహన్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది.
ఇక ఇదే కాకుండా కల్కి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికినట్టు తెలుస్తుంది. టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకే సినిమాను ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ శాటిలైట్ హక్కులు దక్కించుకుందట. డిజిటల్ రైట్స్ కూడా భారీగానే పలికాయట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో 6 కోట్ల డీల్ కుదిరిందట. చూస్తుంటే గరుడవేగా లానే రాజశేఖర్ కల్కి కూడా సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారు.