
అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సమంత తన హవా కొనసాగిస్తుంది. రీసెంట్ గా వచ్చిన మజిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత లేటెస్ట్ గా ఓ బేబీ అంటూ రాబోతుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, నాగ శౌర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే సమంత మళ్లీ మాయ చేసేలా ఉందనిపిస్తుంది. 70 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల పడుచు పిల్లగా మారితే ఆ అనుభవంతో సమంత చేసే నటన, చెప్పే డైలాగ్స్ రెండు ఆకట్టుకున్నాయి. సినిమాకు సమంత నటనే హైలెట్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జూలై 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా అనిపించగా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పొచ్చు.