'సాహో' టీజర్ వచ్చేస్తుంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా టీజర్ జూన్ 13న రిలీజ్ చేయనున్నారు. జూన్ 14న థియేటర్స్ లో సాహో టీజర్ సందడి చేస్తుందట. ప్రభాస్ సరసన శరద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ అన్ని సినిమాపై అంచనాలు పెంచాయి.  

ఇక రాబోతున్న టీజర్ సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయమని అంటున్నారు. ఆల్రెడీ టీజర్ కట్ చేయడం అయిపోయిందట. అందుకే లేటెస్ట్ గా సినిమా నుండి శ్రద్ధా కపూర్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ విషయంలో వస్తున్న రూమర్స్ అన్నిటిని కొట్టిపారేస్తూ ఆగష్టు 15న రిలీజ్ అని పోస్టర్స్ లో వేస్తున్నారు. ఈమధ్యనే సినిమా నుండి మ్యూజిక్ డైరక్టర్స్ శంకర్ ఎహసన్ లాయ్ తప్పుకోగా వారి ప్లేస్ లో జిబ్రాన్ ను తీసుకున్నారని తెలుస్తుంది.