ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లీక్.. ఏకంగా ఆన్ లైన్ లో పెట్టేశారు..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని ఆన్ లైన్ లో లీక్ చేశారు. స్టోరీ మొత్తాన్ని మురళి కృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టాగ్రాం గ్రూప్ లో పెట్టాడు. ఆన్ లైన్ లో కథ ప్రత్యక్షమవగా సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి అది గుర్తించి దానికి కారణమైన ఆ వ్యక్తిని తీసేయమని కోరిందట.   

అయితే అది తీసేందికు సదరు వ్యక్తి డబ్బులు డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు పోలీస్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సినిమా కథ లీక్ ఎలా జరిగింది.. దానికి సహకరించిన వారు ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారట. ఇస్మార్ట్ శంకర్ టీం కు స్టోరీ లీక్ షాక్ అయ్యేలా చేసింది.