
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారిక హాసీ క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమాలో భాగాస్వామ్యం అవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని తెలుస్తుంది. అంతనెవరో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్. సోలో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్న సుశాంత్ బన్ని సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట.
సినిమాలో అతని పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే సుశాంత్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడట. చిలసౌతో హిట్ అందుకున్న సుశాంత్ తర్వాత సినిమా ఏది ఎనౌన్స్ చేయలేదు. బన్ని సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు సుశాంత్. ఇక అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది.