తరుణ్ భాస్కర్ తో వెంకటేష్..!

పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాతో మెప్పించాడు. దర్శకుడిగా తకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్న తరుణ్ భాస్కర్ తన థర్డ్ మూవీ స్టార్ హీరోతో చేస్తాడని తెలుస్తుంది. తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేసే ఆ స్టార్ హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని తెలుస్తుంది. ఎఫ్-2 సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న వెంకటేష్ ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఈ సినిమాతో పాటుగా సురేష్ ప్రొడక్షన్ గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా ఎనౌన్స్ చేసింది. రానా హీరోగా నటించబోతున్న ఆ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్న సురేష్ బాబు తన నిర్మాణంలో ఈ ప్రాజెక్టులను చేస్తున్నాడని తెలుస్తుంది.