
రుద్రమదేవి సినిమాతో దర్శక నిర్మాతగా సక్సెస్ అయిన గుణశేఖర్ మరో చారిత్రక సినిమా చేస్తాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమాపై కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నా ఆ సినిమా ఇంతవరకు పట్టా ఎక్కలేదు. రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ లో హిరణ్యకశ్యప సినిమా ఉంటుందని అన్నారు కాని ఆ సినిమా గురించిన అప్డేట్ రాలేదు. ఫైనల్ గా ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు సంబందించిన సర్ ప్రైజ్ ట్వీట్ చేశారు. మైతలాజికల్ మూవీ హిరణ్యకశ్యప సినిమా రానా టైటిల్ రోల్ తో తెరకెక్కుతుంది. 3 ఏళ్లుగా ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశాడు గుణశేఖర్. ఇక మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తాడని చెప్పాడు. మొత్తానికి మళ్లీ గుణశేఖర్ తన సత్తా చాటేలా ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత కాస్ట్ అండ్ క్రూ ఎలా ఉండబోతుందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Exciting journey with @RanaDaggubati for హిరణ్యకశ్యప #Hiranyakashyapa #OmNamoNarayanaya pic.twitter.com/7GujaMz0nu
— Gunasekhar (@Gunasekhar1) June 1, 2019