చిరు బర్త్ డే.. డబుల్ సర్ ప్రైజ్

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. అది కూడా ఒకటి కాదు రెండు సర్ ప్రైజెస్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్ ను చిరు బర్త్ డే నాడు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో చేస్తున్న సినిమా ముహుర్తం కూడా ఆరోజు ఫిక్స్ చేశారట. పుట్టినరోజు నాడు కొత్త సినిమా ఓపెనింగ్ చేయనున్నారు చిరంజీవి. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కే సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యుయల్ రోల్ లో నటిస్తారని తెలుస్తుంది. అనుష్క, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది.