
నాచురల్ స్టార్ నాని జెర్సీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విక్రం కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని ఈ సినిమాతో పాటుగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'V' సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ ఆల్రెడీ సగానికి పైగా పూర్తి కాగా 'V' సినిమా రీసెంట్ గా మొదలైంది. ఇక ఈ సినిమాల తర్వాత నాని శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందట. సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న నాని స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఇన్నాళ్లకు ఛాన్స్ కొట్టేశాడు. సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందట. ఈసారి తప్పకుండా హిట్ టార్గెట్ తో శ్రీంకాత్ అడ్డాల ఈ సినిమా చేస్తున్నాడు. ఎలాగు నాని కూడా మంచి ఫాంలో ఉన్నాడు కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసేలా ఉంది.