ఆర్.ఆర్.ఆర్ కోసం సాయి పల్లవి..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ నుండి సంచలనంగా మారిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ లను సెలెక్ట్ చేయగా.. ఈ ప్రాజెక్ట్ నుండి డైసీ తప్పుకుంది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకోనున్నారా అని ఆడియెన్స్ లో ఎక్సైట్ మెంట్ ఏర్పడింది.

మొన్నటిదాకా నిత్యా మీనన్ కు ఆర్.ఆర్.ఆర్ లో ఛాన్స్ వచ్చిందని వార్తలు రాగా ఇప్పుడు సాయి పల్లవికి ఆ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. మళయళ ప్రేమమ్ సినిమాలో నటించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. తనదైన అభినయంతో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.     

ఆర్.ఆర్.ఆర్ లో సాయి పల్లవి సెట్ అయితే సినిమాకు మరింత ఎట్రాక్షన్ వచ్చినట్టే. మరి డైసీ ప్లేస్ లో నిత్యా, సాయి పల్లవి వీళ్లని చూస్తున్న జక్కన్న ఫైనల్ గా ఎవరిని ఓకే చేస్తాడో చూడాలి.