
యూత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ తన తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా వస్తున్న సినిమా దొరసాని. గొప్పింటి అమ్మాయి.. పేదింటి అబ్బాయి ఫార్ములాతో వస్తున్న ఈ సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. కె.వి.ఆర్ మహింద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో కారులో దొరసాని అదే హీరోయిన్ శివాత్మిక చాలా అందంగా కనిపిస్తుంది. ఆమెను ఫాలో అవుతూ సైకిల్ మీద ఓరకంటతో చూస్తున్నాడు హీరో ఆనంద్ విజయ్ దేవరకొండ. సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని 2 స్టేట్స్ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోగా చిన్న కూతురు సినిమా దొరసాని మాత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది.