
నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఎప్పటిలానే ఎన్.టి.ఆర్ ఘాట్ వద్దకు తెల్లవారుఝామున 5:30ల సమయంలో వచ్చి తాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు నందమూరి హీరోలు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం. ఇదవరకు ఎన్.టి.ఆర్ జయంతి, వర్ధంతి టైంలో ఎన్.టి.ఆర్ ఘాట్ ను అలకరించేవారు. కాని ఇప్పుడు చంద్రబాబు ఏపికే పరిమితమవడం వల్ల హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ ను పట్టించుకోవడం లేదు. టిడిపి కార్యకర్తలు కూడా ఈరోజు ఎన్.టి.ఆర్ జయంతి అని అక్కడ ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదట.
ఎన్.టి.ఆర్ జయంతి అని తెలిసినా ఎన్.టి.ఆర్ ఘాట్ ను అలంకరించలేదట. తాతకు నివాళి అర్పించాలని వచ్చిన తారక్, కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ ఘాట్ వద్దకు వచ్చి అప్పుడు పూలు, పుష్ప గుచ్చాలను తెప్పించడం జరిగిందట. ఇక నుండి ఎన్.టి.ఆర్ కు సంబందించిన ఏ వేడుకైనా తాను చూసుకుంటానని చెప్పాడట ఎన్.టి.ఆర్. ముందుగా అక్కడ ఏర్పాట్లు చేయకపోవడంతో తారక్ కొద్దిగా అసహనానికి గురైనట్టు తెలుస్తుంది.