
ఏపి ఎలక్షన్స్ లో వైసిపి గెలవగానే తాను తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ ఎనౌన్స్ చేశాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఈ నెల 31న ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఏపిలో ఆ సినిమా విడుదల కాకుండా కుట్రలు జరిగాయని.. కొందరు నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతో సినిమా ఆపేశారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 31న ప్రజలంతా నిజాలు తెలుసుకుంటారని అన్నారు. సైకిల్ టైర్ పంక్చర్ అయ్యిందనే కారులో వచ్చానని అన్నారు వర్మ.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టిన వర్మ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇక నెక్స్ట్ తను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీయబోతున్నట్టు చెప్పుకొచ్చారు వర్మ. మహర్షి సినిమాపై కూడా స్పందించిన వర్మ రైతు కష్టాలు తనకు తెలియదని.. తాను ఎప్పుడూ పొలానికి వెళ్లలేదని అన్నారు. గ్రామాలు, పొలాలు అంటే తనకు అసలు ఇష్టం ఉండదని అన్నారు ఆర్జివి. తన సినిమాలా ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనని.. మహేష్ బాబు లేకుండా మహర్షి సినిమా తీస్తే ఎవరు చూడరని అన్నారు ఆర్జివి.
రైతుల గురించి ఎన్నో సినిమాలు వస్తున్నా.. మహర్షి సినిమా ఆదరించడానికి మహేష్ బాబే కారణమని అన్నారు. హీరోని చూసే సినిమాలు చూస్తున్నారని.. పాటలు, కామెడీ కోసం కూడా థియేటర్లకు వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. మహర్షి సినిమా కేవలం ఫన్ కోసమే చూస్తారని.. బయటకు వచ్చి సందేశం ఉందటూ చెబుతా రని పంచ్ వేశాడు ఆర్జివి.