వెంకీ మామ రిలీజ్ డేట్.. మామా అల్లుళ్ల హంగామా ఆరోజు నుండే..!

టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అదే వెంకీ మామ. ఈసారి రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎఫ్-2తో సంచలన విజయం అందుకున్న వెంకటేష్ మళ్లీ వెంకీ మామతో అదే హిట్ ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. 

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమా వెంకీమామ. మజిలీ సూపర్ హిట్ తో చైతు.. ఎఫ్-2 హిట్ తో వెంకటేష్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా వారి సక్సెస్ మేనియా కొనసాగించేలా ఉంటుందో లేదో చూడాలి. ఆగష్టు 15న సాహో రిలీజ్ ఫిక్స్ చేయగా.. అక్టోబర్ 2న సైరా కూడా రిలీజ్ అంటున్నారు. అందుకే వెంకీ మామ కూడా సెప్టెంబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. చూస్తుంటే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత హంగామా ఉండేలా కనిపిస్తుంది.