వైఎస్ జగన్ విక్టరీ.. యాత్ర 2 సర్ ప్రైజ్..!

2019 ఏపి ఎలక్షన్స్ లో ప్రజలు వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. 150 సీట్ల ఆధిక్యంతో స్పష్టమైన మెజారిటీతో వైఎస్సార్సిపి పార్టీ ఎన్నికల్లో విజయ ఢంఖా మోగించింది. వైఎస్ జగన్ విజయం గురించి తెలుసుకున్న సిని సెలబ్రిటీలు ఎంతోమంది ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ ఇయర్ యాత్ర సినిమా ద్వారా మరోసారి రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేశారు డైరక్టర్ మహి వి రాఘవ్. వైఎస్ జగన్ విజయం గురించి ప్రస్థావిస్తూ ఓ సర్ ప్రైజ్ ట్వీట్ చేశారు మహి వి రాఘవ్.    

జగన్ అన్నా.. ఈ విజయానికి మీరు అర్హులు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారి కంటే గొప్ప పరిపాలన సాగిస్తారని ఆశిస్తున్నా.. నేను చెప్పాల్సిన ఓ కథను మీరు రాశారు అంటూ యాత్ర 2 హ్యాష్ ట్యాగ్ పెట్టారు మహి వి రాఘవ్ ట్వీట్ చేశారు. యాత్ర సినిమా సమర్పకులు శివమేక ను ట్యాగ్ చేశారు. సో యాత్ర సీక్వల్ గా వైఎస్ జగన్ విజయాన్ని చూపిస్తూ యాత్ర 2 ఏదైనా చేసే ఆలోచన ఉందని తెలుస్తుంది.