
పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న సమంత ఆఫ్ స్క్రీన్ తన బాడీ ఫిట్ నెస్ వీడియోలతో కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. బాడీ ఫిట్ గా ఉంచుకోవడంలో చాలా కష్టపడే సమంత లేటెస్ట్ గా 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసి ఔరా అనిపించింది. ఎందుకింత కష్టం అనుకోవచ్చు ఫిట్ గా ఉంటేనే ఏదైనా చేయొచ్చని సమంత గట్టి నమ్మకం.. అది వాస్తవం కూడా అందుకే ఏది ఎలా ఉన్నా తన ఫిట్ నెస్ విషయంలో మాత్రం రాజీ పడదు సమంత.
100 కిలోల బరువు ఎత్తి మరోసారి తను ఎంత స్ట్రాంగ్ అన్నది నిరూపించుకుంది. తనలా సూపర్ స్ట్రాంగ్ గా ఉండండని అ వీడియోని ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది అమ్మడు. అది చూసిన సమంత ఫ్యాన్స్ నువ్వు నిజంగా ఐరన్ లేడీవి అంటున్నారు. బాడీ ఫిట్ నెస్ విషయంలో సమంత తీసుకుంటున్న జాగ్రత్తలు తన ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఓ బేబీ సినిమాలో నటిస్తున్న సమంత ఆ సినిమాలో నటనతో కూడా సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతుంది.