
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా మహర్షి సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మహర్షి సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్ ఈ సక్సెస్ కు కారణమైన వంశీ పైడిపల్లికి మరో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
మనమిద్దరం కలిసి మరో సినిమా చేసేద్దామని మహేష్ హామి ఇచ్చాడట. అయితే మహేష్ తన తర్వాత సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో చేస్తున్నాడు. జూన్ రెండో వారం నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. 2020 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తుందట. ఆ సినిమా తర్వాత త్రివిక్రం, రాజమౌళి ఈ ఇద్దరిలో ఒకరితో మహేష్ సినిమా ఉంటుందట. అది కూడా పూర్తయితే వంశీ పైడిపల్లి మూవీ చేస్తాడట. సో ఎలా లేదన్నా మళ్లీ మహేష్ సినిమా కోసం వంశీ పైడిపల్లి రెండేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పటిదాకా ఆగుతాడో మరో సినిమా చేస్తాడో చూడాలి.