
చిన్న సినిమాలతో మొదలై స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ తర్వాత తెలుగులో కొద్దిగా అవకాశాలు సన్నగిల్లినా మళ్లీ ఇప్పుడు వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఒకేసారి తండ్రి కొడుకులతో నటిస్తుంది రకుల్. నాగార్జున మన్మధుడు 2లో చేస్తున్న రకుల్, నాగ చైతన్య సరసన వెంకీమామలో జోడీ కడుతుంది. ఈమధ్యనే బాలీవుడ్ లో అమ్మడు చేసిన దే దే ప్యార్ దే సినిమా కూడా హిట్ అందుకుంది.
కెరియర్ లో అప్ డౌన్స్ సహజమే అని నమ్ముతున్న రకుల్ ఆ సినిమా ప్రమోషన్స్ లో తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 3 లక్షణాలు పక్కాగా ఉండాలంటూ చెబుతుంది రకుల్ అందులో మొదటిది హైట్.. ఆరడుగుల ఆజానుబావుడు కావాలట. ఇక రెండోది తను చాలా నిజాయితీగా, సరదాగా ఉండాలని అంటుంది.. ఇక ఫైనల్ గా 3వది మాత్రం కాస్త విచిత్రంగా ఉంది.
రొటీన్ జాబ్ అని కాకుండా జీవితంలో ఏదైనా సాధించేలా ఉండాలట. రొటీన్ జాబ్ ఇష్టపడని వ్యక్తి కావాలంటుంది. ఇలా ముచ్చటగా మూడు లక్షణాలు చెప్పుకొచ్చింది. మరి సరిగ్గా ఇలాంటివి ఉన్న అబ్బాయినే రకుల్ పెళ్లాడుతుందో లేదో చూడాలి.