
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వత చేస్తున్న సినిమా జాన్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా సాహో నిర్మాతలు యువి క్రియేషన్స్ వారే నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సాహో కోసం 250 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్న నిర్మాతలు.. జాన్ సినిమాకు కూడా బడ్జెట్ భారీగానే పెడుతున్నారట.
1970 కాలం నాటి కథతో యూరప్ బ్యాక్ డ్రాప్ లో జాన్ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం యూనిట్ అంతటిని యూరప్ తీసుకెళ్లడం కన్నా ఓ సెట్ వేస్తే బెటర్ అని భావించి హైదరాబాద్ లోనే యూరప్ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ కోసం దాదాపు 30 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఒక్క సెట్ కే అంత పెడుతున్నారు అంటే బడ్జెట్ గా ఈ సినిమాకు భారీ ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. సాహో ఈ ఇయర్ ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తుండగా జాన్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.