మారుతితో సాయి తేజ్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తన పేరుని సాయి తేజ్ గా మార్చుకుని ఈమధ్యనే చిత్రలహరి సినిమా ద్వారా ప్రేక్షకులను పలుకరించాడు. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్న సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక ఇదే జోష్ తో మారుతితో సినిమాకు రెడీ అవుతున్నాడు సాయి తేజ్. ఈ సినిమా కూడా ఓ ఎమోషనల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. ఆల్రెడీ కథ లాక్ చేశారట. తండ్రి కొడుకుల మధ్య సాగే కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మాణం ఉంటుందట. సినిమాలో సాయి తేజ్ తండ్రిగా రావు రమేష్ నటిస్తాడని తెలుస్తుంది. ఇక మిగిలిన పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది. అల్లు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉన్న మారుతి వారి ప్రొడక్షన్ లో భలే భలే మగాడివోయ్ సినిమా చేశాడు. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా అతని కెరియర్ లోనే అప్పటి వరకు ఉన్న సినిమాలకన్నా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి సాయి తేజ్ సినిమా కూడా అలానే క్రేజీ హిట్ కొడుతుందేమో చూడాలి.