
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా గురువారం రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ సంఖ్యలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లతో బీభత్సం సృష్టించింది. సినిమా మొదటి రోజు 30 కోట్ల షేర్ రాబట్టిందదని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మహర్షి మేనియా కొనసాగుతుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఏరియాల వారిగా మహర్షి ఫస్ట్ డే కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 5.35 కోట్లు
సీడెడ్ : 2.88 కోట్లు
ఉత్తరాంధ్ర : 6.38 కోట్లు
ఈస్ట్ : 3.2 కోట్లు
వెస్ట్ : 2.47 కోట్లు
గుంటూరు : 4.4 కోట్లు
నెల్లూరు : 1 కోటి
ఏపి/తెలంగాణా : 24.6 కోట్లు