హిప్పి ట్రైలర్.. యాటపోతు కాదు అది యాటకత్తి..!

ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కార్తికేయ తన తర్వాత సినిమాగా హిప్పి చేస్తున్నాడు. తమిళ బడా నిర్మాత కళైపులి ఎస్ థను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టిఎన్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా ఈరోజు హిప్పి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. బాక్సర్ గా ఉండే హీరో.. హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అయితే హీరోయిన్ కేవలం అతనితో డేటింగ్ అని మాత్రమే చెబుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి అతని జీవితం ఎలా నాశనమైంది అన్నది హిప్పి సినిమా.

డేటింగ్ కల్చర్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సీనియర్ హీరో జెడి చక్రవర్తి నటించడం విశేషం. ముడు యాటపోతును పుట్టించిందే బిరియాని కోసం.. గా బిరియాని నీకు రోజూ దొరుకుతుంటే తిని హ్యాపీగా ఉండొచ్చుగదరా.. అంటూ జేడి చెబుతుండగా అది యాటపోతు కాదు బాస్.. యాటకత్తి అని కార్తికేయ అనడం ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆరెక్స్ 100 సినిమాతో సత్తా చాటిన కార్తికేయ హిప్పితో కూడా తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. మరి హిప్పి కార్తికేయ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి.