
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా కల్కి. టైటిల్ పోస్టర్ తో పాటుగా మొన్నామధ్య రిలీజైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచగా లేటెస్ట్ గా ఈరోజు సినిమా ట్రీలర్ రిలీజైంది. ఇక ఈ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది సినిమా ట్రైలర్ లో కూడా రివీల్ చేయలేదు. అంతేకాదు ట్రైలర్ లో హైలెట్ గా ఏం చెప్తిరి ఏం చెప్తిరి అనే రాజశేఖర్ మార్క్ డైలాగ్ ఆకట్టుకుంది.
అయితే గబ్బర్ సింగ్ సినిమాలో రాజశేఖర్ ను ఇమిటేట్ చేస్తూ ఓ ఫైటర్ చేసిన కామెడీ డ్యాన్స్ ఫేమస్ అవగా ఇప్పుడు అదే ఆర్టిస్ట్ తో తన మీద తనే సెటైర్ వేసుకుంటూ పవన్ కళ్యాన్ కు పంచ్ వేశాడు రాజశేఖర్. అ! సినిమాతోనే సత్తా చాటిన ప్రశాంత్ వర్మ కల్కిని కూడా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో రాజశేఖర్ సరసన అదా శర్మ నటిస్తుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్రయూనిట్. పిఎస్వి గరుడవేగ తర్వాత రాజశేఖర్ నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.