
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ విద్యా బాలన్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. రీసెంట్ గా తెలుగులో ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించి మెప్పించిన విద్యా బాలన్ మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. అప్పట్లో సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన డర్టీ పిక్చర్ తో తన సత్తా చాటిన విద్యా బాలన్ మరోసారి గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి బయోపిక్ లో నటిస్తుంది.
ఓ చిన్న విలేజ్ నుండి వచ్చిన ఆమె తన ప్రతిభతో ఎలా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అను మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ కల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ట్విట్టర్ ద్వారా వెళ్లడించింది విద్యా బాలన్. మ్యాథ్ జీనియస్ శకుంతల దేవి పాత్రలో నటించడం ఎక్సైటింగ్ గా ఉందని విద్యా బాలన్ ట్వీట్ చేశారు.