
కింగ్ నాగార్జున హీరోగా చిలసౌ డైరక్టర్ రాహుల్ రామకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మధుడు-2. నాగ్ కెరియర్ లో క్లాసికల్ హిట్ అందుకున్న ఆ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వల్ కథ కుదిరింది. చిలసౌ సినిమాతో సత్తా చాటిన రాహుల్ రామకృష్ణ ఈ సినిమా కూడా చాలా క్లవర్ గా డీల్ చేస్తున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. రకుల్ తో పాటుగా అక్షర గౌడ కూడా సినిమాలో నటిస్తుంది. ఈ ఇద్దరు చాలరు అన్నట్టుగా కీర్తి సురేష్ ను కూడా తీసుకున్నారట.
మహానటి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓపెనింగ్ అయితే జరిగింది కాని ఆ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. లేటెస్ట్ గా నాగ్ మన్మధుడులో కీర్తి సురేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఓ పక్క స్టార్ హీరోస్ తో నటిస్తున్న కీర్తి సురేష్ సీనియర్ స్టార్స్ అయిన రజిని, నాగార్జున లాంటి వారితో కూడా జోడీ కడుతుంది. సినిమాలో కీర్తి సురేష్ ది చిన్న పాత్రే కాని చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. మొత్తానికి మన్మధుడు-2ని ఊహించిన దానికంటే క్రేజీ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారని చెప్పొచ్చు.