
సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా గురువారం అనగా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ఉందనగా మహర్షి సినిమా రకరకాల చిక్కుల్లో పడ్డది. ఓ పక్క టికెట్ ప్రైజ్ పై రగడ కొనసాగుతుంది. తెలంగాణా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎలా టికెట్ ప్రైజ్ పెంచుతారని అంటున్నారు. ఇది కాకుండా సినిమాకు ఐదు షోలు వేస్తున్నారా రెగ్యులర్ గా వేసే నాలుగు షోలేనా అన్నది కన్ ఫ్యూజన్ గానే ఉంది.
ఇవన్ని ఒక ఎత్తైతే మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఆఫీస్, ఇళ్లల్లో ఐటి సోదాలు జరిగాయి. సరిగ్గా ఒకరోజు ముందే మహర్షి మీద ఇలా అన్ని వైపుల నుండి ఎటాక్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. దిల్ రాజుతో పాటుగా అశ్వనిదత్, పివిపి కూడా మహర్షి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.మరి ఎందుకు దిల్ రాజు మీదే ఎటాక్ చేశారో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా టికెట్ ప్రైజ్ పై కోర్ట్ నుండి ఆర్డర్ తెచ్చుకోవడం పట్ల తెలంగా ప్రభుత్వం చాలా సీరియస్ గాఉంది. మహర్షి రిలీజ్ కు అడ్డు చెప్పకపోవచ్చు కాని అనవసరమైన చర్చలకు దారితీస్తుంది.