2 కోట్ల కోసం అంత దిగజారాల్సిన అవసరం నాకు లేదు

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఖైది నంబర్ 150 సూపర్ సక్సెస్ వగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న రెండవ సినిమా సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చిందని తెలుస్తుంది. అయితే ఈమధ్యనే కోకాపేట్ లోని చిరు ఫాం హౌజ్ లో సైరా సెట్ ఒకటి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలి బూడిదైంది. 

దాదాపు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తి దశలో ఉండగా రికవరీ కోసం కావాలని ఈ ఫైర్ యాక్సిడెంట్ చేయించారని కొందరు అంటున్నారట. ఆ మాటలు ఆ నోటా ఈ నోటా పడి చరణ్ చెవిన పడ్డాయి. అయితే వందల కోట బడ్జెట్ తో సినిమా తీస్తుంటే కేవలం 2 కోట్ల కోసం అంతగా దిగజారాల్సిన అవసరం తనకు లేదని సన్నిహితులతో అన్నాడట. అది కరెక్టే కదా.. అయినా కావాలని సెట్ ప్రాపర్టీని ఎవరైనా అలా నాశనం చేసుకుంటారా.. సెలబ్రిటీస్ మీద ఇలాంటివి కామన్ కాబట్టి విని విన్నట్టుగా సర్ధుకుపోవాల్సిందే.